గంజాయి పట్టివేత.. ఒకరి అరెస్టు

MDK: నర్సాపూర్‌లో 310 గ్రాముల గంజాయి పట్టుకున్నట్టు టాస్క్ ఫోర్స్ సీఐ గోపాల్ తెలిపారు. ఎక్సైజ్ జిల్లా అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సాపూర్ పట్టణ జగన్నాథ రావు కాలనీలో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. వెంకటేష్ అనే వ్యక్తి ఇంటీని తనిఖీ చేయగా 310 గ్రాముల గంజాయి లభించినట్లు వివరించారు. ఇందులో ఎస్సై బాలయ్య, చంద్రయ్య, ఎల్లయ్య, రాజు, రవి పాల్గొన్నారు.