జిల్లాలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన

జిల్లాలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన

TPT: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతి జిల్లా పర్యటన ముగిసింది. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ఆమె రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ మేరకు హోం మంత్రి అనిత ఆమెకు వీడ్కోలు పలికారు. అనంతరం ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి హైదరాబాద్‌కు వెళ్లారు. ఈ కర్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.