VIDEO: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి: ఎమ్మెల్యే
WGL: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు సూచించారు. పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌ను ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. విద్యార్థులతో స్వయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.