బాకీ డబ్బులు ఇవ్వాలని యువకుడిపై దాడి
SRD: కంది మండలం కలివేముల గ్రామంలో బాకీ డబ్బు కోసం ఓ యువకుడిపై దాడి జరిగింది. M. అనిల్ (35) గతంలో తలారి పాండు వద్ద రూ. లక్ష అప్పుగా తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ తమ డబ్బు ఇవ్వాలంటూ పాండు, భార్య సునీత, సందీప్, శేఖర్, వినయ్ కలిసి అనిల్‌పై దాడి చేశారు. తీవ్ర గాయాలపాలై అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.