'కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'
కృష్ణా: వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపుమేరకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం నందివాడ మండలం కుదరవల్లిలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసీపీ జిల్లా జనరల్ సెక్రటరీ నాగరాజు, ఎంపీపీ పెయ్యల ఆదాం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సేకరణలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.