జాతీయస్థాయి పోటీలకు అర్చన

జాతీయస్థాయి పోటీలకు అర్చన

SDPT: నంగునూరు మండలం గట్ల మల్యాల జడ్పీహెచ్ఎస్‌లో 8వ తరగతి చదువుతున్న బానోతు అర్చన జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికై చరిత్ర సృష్టించింది. గత నెలలో మహబూబాబాద్‌లో అండర్-14 సాఫ్ట్ బాల్ పోటీలలో అర్చన పాల్గొని ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో 2వ స్థానంలో నిలిచింది. ఈనెల 16న ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటుందని HM రమేష్ తెలిపారు.