VIDEO: చెరువును తలపిస్తున్న సబ్ స్టేషన్

NZB: సిరికొండలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లోకి నీళ్లు వచ్చి చేరాయి. ఎల్లమ్మ చెరువు అలుగు నీరు సబ్‌స్టేషన్ మీదుగా గ్రామంలోకి వెళ్తున్నట్లు చెప్పారు. కరెంటు ట్రిప్ అయితే యార్డులోకి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉందని, రాత్రివేళ పాములు, విష పురుగులు వస్తున్నాయని శనివారం సబ్‌స్టేషన్ సిబ్బంది వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.