'అప్పనపల్లి అసిస్టెంట్ కమిషనర్‌పై పిర్యాదు
KKD: అప్పనపల్లి దేవస్థాన నాయీ బ్రాహ్మణులను కులం పేరుతో దూషించిన ఆలయ ఏసీపై చర్యలు తీసుకోవాలని ధన్వంతరి నాయీ బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈనెల 4న ఆయన దూషించడమే కాకుండా, ఆ వీడియోను గ్రూపుల్లో పోస్ట్ చేశారని ఆరోపిస్తూ సోమవారం కాకినాడ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.