'తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టండి'
VZM: స్థానిక జడ్పీ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమగ్ర రక్షిత మంచి నీటి పథకాలు, ఆపరేషన్, నిర్వహణ పనుల పురోగతి, తదితర అంశాలపై ఆయన చర్చించారు. అలాగే ప్రజలకు నిరంతరంగా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.