ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
PDPL: మంథని ఎక్లాస్పూర్‌లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు, మహిళల ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 21 కుట్టు కేంద్రాలు, 850 మిషన్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా కుట్టు కేంద్రాలు, మొబైల్ క్యాంటీన్లు, ఆర్టీసీ బస్సులు, సోలార్ ప్లాంట్లు వంటి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నయన్నారు.