గోశాల, వ్యవసాయం క్షేత్రం పరిశీలన
VSP: సింహాచలంలోని ఆలయంలో గోశాల, వ్యవసాయ క్షేత్రాన్ని దేవస్థానం ఈవో జె.వెంకటరావు సోమవారం పరిశీలించారు. నిత్యాన్న ప్రసాదానికి వినియోగించే కూరగాయల సాగును, కరివేపాకు తోటలను ఆయన పరిశీలించి సేంద్రియ పద్ధతిలో నాణ్యమైన పంటలు పండించాలని అధికారులకు సూచించారు. గోశాల ఆవరణలోని నేచురోపతి ఆసుపత్రి, సోలార్ పవర్ ప్లాంట్ పనితీరును సమీక్షించారు.