పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కలెక్టర్

పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కలెక్టర్

JGL: రాయికల్ మండల కేంద్రంలో మంగళవారం కలెక్టర్ సత్యప్రసాద్ పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రధాన రహదారులు, కాలనీలు, మార్కెట్ ప్రాంతాల్లో శుభ్రతను తనిఖీ చేశారు. ఎక్కడ చెత్త పేరుకుపోకుండా నిరంతరం చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రదేశాల్లో అపరిశుభ్రత ఉంటే కఠిన చర్యలు ఉంటాయని, ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.