అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

NRPT: దామరగిద్ద మండలం మొగల్మడక గ్రామంలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారనే పక్కా సమాచారంతో ఎస్సై రాజు ఆధ్వర్యంలో బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. గుంత హనుమంత్ ఇంటి వద్ద సుమారు 7 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, అక్రమంగా రేషన్ బియ్యాన్ని అమ్మితే కఠిన చర్యలు ఉంటాయన్నారు.