ఉచిత పశు వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే
PLD: దుర్గి మండలం తేరాల గ్రామంలో దుర్గి మార్కెట్ యార్డ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపూజలు నిర్వహించి, పశువులకు వ్యాక్సిన్లు అందించారు. శిబిరంలో పాల్గొన్న రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.