7,500 పుస్తకాలతో గణనాథుడి విగ్రహం

7,500 పుస్తకాలతో గణనాథుడి విగ్రహం

చెన్నైలోని మన్నాలిలో ఓ అరుదైన గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. దీన్ని ఏకంగా 7,500 పుస్తకాలతో రూపొందించారు. వాటిలో 5,000 భగవద్గీతలు, 1,500 వేల్ విరుతం, 1,008 మురుగన్ కవాసం పుస్తకాలు ఉన్నాయి. ఇది పర్యావరణ పరిరక్షణ, ఆధ్యాత్మికతకు ప్రాధాన్యత ఇస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఈ వినూత్న విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ పుస్తకాలను నిమజ్జనం తర్వాత భక్తులకు పంపిణీ చేస్తారు.