'ఆర్టీసీ వ్యవస్థను గత పాలకులు నిర్లక్ష్యం చేశారు'
PLD: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ పెరిగిందని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గురువారం చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ఏపీ టీటీడీ కార్మిక పరిషత్ జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రజా సేవలో భాగమైన ఆర్టీసీ వ్యవస్థను గత పాలకులు నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు.