క్రీడాకారులకు ట్రాక్ సూట్లను అందజేసిన ఎమ్మెల్యే
SRD: క్రీడల అభివృద్ధి కోసం ఎల్లప్పుడు పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఇటీవల పటాన్‌చెరులో జరిగిన ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్-14 బాలురు, బాలికల కబడ్డీ, అండర్-17 బాలుర వాలీబాల్ పోటీలలో విజేతలైన క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. సోమవారం ఈ క్రీడాకారులకు, ఎమ్మెల్యే సొంత నిధులతో ట్రాక్ షూట్లను అందజేశారు.