VIDEO: గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన: ఎంపీడీవో
KKD: సామర్లకోట(M)లోని 18 గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3 నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కానుందని ఎంపీడీవో హిమామహేశ్వరి తెలిపారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు