రోడ్డు ప్రమాదం.. ఇద్దరికీ తీవ్ర గాయాలు
ADB: గుడిహత్నూర్ మండలం ముత్నూర్ రహదారిపై బుధవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న కాంగ్రెస్ నాయకుడు ఆడే జైపాల్ స్పందించి, క్షతగాత్రులను అంబులెన్స్‌లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.