VIDEO: జ్యోతిబాపూలే ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలి: కవిత
NZB: సమాజంలో సగమైన మహిళలకు సమాన హక్కులు కల్పించాలని గళమెత్తిన యుగ పురుషుడు మహాత్మా జ్యోతిబాపూలే అని జాగృతి చీఫ్ కవిత అన్నారు. జ్యోతిబాపూలే వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించారు. ఈ మేరకు ఆయన సేవలను స్మరించుకున్నారు. సామాజిక అంతరాలపై తన కలంతో 'గులాంగిరి' ద్వారా యుద్ధశంఖం పూరించిన మహనీయుడిగా కొనియాడారు.