రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

KNR: ద్విచక్ర వాహనాన్ని మరో బైక్ వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తీగలగుట్టపల్లికి చెందిన మిట్టపల్లి వెంకటస్వామి(65) తన వాహనంపై కరీంనగర్ వస్తుండగా, రాగంపేటకు చెందిన రాజకుమార్ అతివేగంగా వచ్చి ఢీకొట్టాడు. తీవ్ర గాయాలైన వెంకటస్వామి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.