మహిళలను వేధించిన ఇద్దరు ఆకతాయిలు అరెస్ట్..!
NGKL: శనివారం నాగర్ కర్నూల్ బస్టాండ్ వద్ద మహిళలను వేధిస్తున్న ఇద్దరు నిందితులను జిల్లా షీ టీం సభ్యులు ఎస్సై రజిత, ఏఎస్సై విజయలక్ష్మీ మాఫ్టీలో వెళ్లి గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మహిళలను వేధిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని షీటీం ఎస్సై రజిత హెచ్చరించారు. మహిళల భద్రతకు షీటీం 24/7 అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు.