'జరిమానాలు తప్పక చెల్లించాలి'

'జరిమానాలు తప్పక చెల్లించాలి'

అన్నమయ్య: వాహన తనిఖీల సమయంలో విధించిన జరిమానాలు తప్పక చెల్లించాలని రామసముద్రం ఎస్సై వెంకటసుబ్బయ్య కోరారు. ఆయన మాట్లాడుతూ.. వాహనాల తనిఖీ సమయంలో జరిమానా వేసినప్పటికీ చాలామంది కట్టడం లేదున్నారు. మీ సేవా కేంద్రం, సచివాలయం, స్థానిక పోలీస్ స్టేషన్లో జరిమానా చెల్లించి రసీదు పొందాలని సూచించారు. లేకపోతే ఆయా వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.