సర్పంచ్ చెల్లమ్మకు సత్కారం

సర్పంచ్ చెల్లమ్మకు సత్కారం

ASR: ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా కించుమండ సర్పంచ్ హెచ్.బి. చెల్లమ్మకు అరుదైన గౌరవం లభించింది. డుంబ్రిగూడ మండలంలోని తన పంచాయతీలో టీబీపై విస్తృత ప్రచారం నిర్వహించి, పారిశుధ్య కార్యక్రమాలను సమర్థవంతంగా చేపట్టినందుకు ఐటీడీఏ కార్యాలయంలో ఆమెను ఘనంగా సత్కరించారు. ప్రజా ఆరోగ్యంపై ఆమె చూపుతున్న నిబద్ధత అందరికీ ఆదర్శనీయమని ఆయన కొనియాడారు.