చిన్నారిని ఎత్తుకుని లాలించిన ఎమ్మెల్యే
ATP: శింగనమల నియోజకవర్గం పరిధిలో జరిగిన పలు శుభకార్యాలకు ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో ఒక చిన్నారిని ఎత్తుకుని లాలించారు. అనంతరం ప్రజలతో సెల్ఫీలు దిగి వారిలో సంతోషాన్ని నింపారు. ఈ పర్యటనలో ప్రజలతో కాసేపు ముచ్చటించారు.