ఆర్ కొత్తపల్లెలో రీ సర్వే గ్రామ సభ
KRNL: బేతంచెర్ల మండలంలోని ఆర్ కొత్తపల్లె గ్రామ సచివాలయం వద్ద రీ సర్వేపై గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ నాగమణి సోమవారం తెలిపారు. ఆర్ కొత్తపల్లె, ఆర్ బుక్కపురం రైతులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ఏపీ సరిహద్దుల చట్టం 1923 సెక్షన్ 9(2) ప్రకారం పట్టాదారులు, ప్రభుత్వ భూములకు నోటీసులు జారీ అవుతాయని పేర్కొన్నారు. రైతులు సమస్యలు తెలియజేయాలని సూచించారు.