ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు
RR: గచ్చిబౌలి జంక్షన్‌లో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాంగ్ రూట్‌లో ప్రయాణించవద్దని, విధిగా యూనిఫాం ధరించాలని తెలిపారు. అనుమతి పత్రాలు లేకుండా వాహనం నడప రాదని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అవసరమని అధికారులు సూచించారు.