తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణ పనులు పరిశీలన

విజయనగరం: నియోజకవర్గ కేంద్రమైన గజపతినగరంలో నిర్మిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం భవనం పనులు చురుకుగా జరుగుతున్నాయి. ఆదివారం ఈ మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ కార్యాలయం నిర్మాణ పనులను పరిశీలించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. కార్యాలయం పూర్తి అయితే ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు.