ఆకివీడులో ప్రజా సమస్యలపై CPM నిరసన
W.G: ఆకివీడులో ప్రజా సమస్యల పరిష్కారం కోసం CPM ఆధ్వర్యంలో నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఇవాళ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా CPM నాయకులు మాట్లాడుతూ.. మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్ల సమస్యలను పరిష్కరించాలని, తాళ్లకోడు కాలనీలో మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని, వేసవిలో వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలన్నారు. అనంతరం మేనేజర్ వెంకటేశ్వర రావుకు వినతిపత్రం అందజేశారు.