వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
JGL: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా, ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని ఏఎంసీ ఛైర్మన్ తిరుపతి కోరారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.