నూతన MROను సన్మానించిన.. స్థానిక నేతలు

నూతన MROను సన్మానించిన.. స్థానిక నేతలు

BHPL: చిట్యాల మండలం నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన వసంతరావు& డిప్యూటీ తహసీల్దార్ అనిల్ను సోమవారం నవాబుపేట నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పూల మొక్క అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నవాబుపేట గ్రామ సర్పంచ్ పర్లపల్లి రవి, మాజీ ఎంపీటీసీ చెక్క నర్సయ్య, కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి ఉన్నారు.