ఒంటికాళ్లపై నిలబడి నిరసన చేస్తున్న ఉపాధ్యాయులు

ఒంటికాళ్లపై నిలబడి నిరసన చేస్తున్న ఉపాధ్యాయులు

SKLM: సీతంపేట ఐటీడీఏ వద్ద గిరిజన ఆశ్రమ పాఠశాల ఔట్‌సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలపై 31వ రోజు ఉపాధ్యాయులు ఒంటికాళ్లపై నిలబడి వర్షంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఉపాధ్యాయులు కోరుతున్న డిమాండ్లును ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలన్నారు. డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు.