సచివాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో

ప్రకాశం: పామూరు మండల కేంద్రంలోని స్థానిక మూడవ సచివాలయాన్ని గురువారం ఎంపీడీవో ఎల్ బ్రహ్మయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సచివాలయంకి వచ్చే ప్రజల సమస్యలను కనుక్కొని వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు. అలాగే సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు.