'పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగుపడుతుంది'

'పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగుపడుతుంది'

KKD: గొల్లప్రోలు నగర పంచాయతీకి 15వ ఆర్థిక సంఘం నిధులతో సమకూర్చిన మూడు ట్రాక్టర్లు, చెత్త తొట్టెలు, 25 పుష్ కాట్లను సోమవారం పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ప్రారంభించారు. సుమారు రూ.37 లక్షల నిధులతో వీటిని కొనుగోలు చేసినట్లు ఆయన మీడియాకు తెలిపారు. వీటితో పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగుపడుతుందని కమిషనర్ కనకరాజు పేర్కొన్నారు.