ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌కు వినతి
సత్యసాయి: ధర్మవరంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి 100వ జయంతి సందర్భంగా ఈ నెల 11న జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వేలమంది ప్రజలు తరలివస్తారని బీజేపీ నేతలు అన్నారు. వారి రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ మధుసూదన్‌ను బస్సులు అదనంగా సమకూర్చాలని బీజేపీ జిల్లా నాయకులు వినతి పత్రం అందించారు.