రాత్రి వేళల్లో నిర్మాణ పనులు
KDP: సిద్దవటం మండలం ఉప్పరపల్లెలోని కడప-చెన్నై జాతీయ రహదారి పెద్దపల్లి రెవెన్యూ స్థలం కోర్టు పరిధిలో ఉంది. నిబంధనలను ఉల్లంఘించి ఆదివారం రాత్రి గుట్టు చప్పుడు కాకుండా నిర్వాహకులు షట్టర్ నిర్మాణ పనులు చేపట్టారు. మీడియాను చూసి కూలీలు పరారయ్యారు. సిద్దవటం MRO ఆదేశాలతో వీఆర్ఏ వెంకటసుబ్బయ్య అక్కడికి చేరుకొని పనులను నిలుపుదల చేసి MROకు సమాచారం అందజేశారు.