విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

RR: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. రాజారామ్ కాలనీలో శివలీలా అనే మహిళ విద్యుత్ షాక్‌తో మరణించింది. ఇంట్లో ఉన్న వాటర్ హీటర్ ఆన్ చేసే క్రమంలో ఈ ఘటన జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.