TCSలో 30 వేల మందికి లేఆఫ్?.. సంస్థ స్పందన

30 వేల నుంచి 40 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు టీసీఎస్ సిద్ధమైందంటూ వస్తున్న వార్తలపై ఆ సంస్థ స్పందించింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఈ ఊహాగానాలు తప్పుదోవ పట్టింటే విధంగా ఉన్నాయని పేర్కొంది. ముందుగా చెప్పినట్లు తమ ఉద్యోగుల సంఖ్యలో 2 శాతం అంటే 12 వేల మందికిపైగా ఉద్యోగులను మాత్రమే తొలగిస్తున్నట్లు వెల్లడించింది.