ఎన్నికల హామీ మేరకు ఆసరా పెన్షన్లు పెంచాలి: ఆనందరావు

WGL: ఎన్నికల హామీ మేరకు ఆసరా పెన్షన్లను పెంచాలని MSP జిల్లా ఇంఛార్జ్ ఆనందరావు డిమాండ్ చేశారు. పర్వతగిరి(M) కల్లెడలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 28న వర్ధన్నపేటలో నిర్వహించే సన్నాహక సభకు వృద్ధులు, వితంతువులు, వికలాంగులు భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సభకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరవుతారని తెలిపారు.