కొత్తకొట్టాంలో సంక్రాంతి సంబరాలు

కొత్తకొట్టాంలో సంక్రాంతి సంబరాలు

తూ.గో: కోటనందూరు మండలం కొత్తకొట్టాంలోని కొత్తరామాలయం వద్ద సంక్రాంతి సంబరాలు గ్రామ యువత ఆధ్యర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళవారం ముగ్గుల పోటీ, లెమెన్ స్పూన్, మ్యూజికల్‌ చైర్స్‌ పోటీలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులతో పాటు పోటీల్లో పాల్గొన్నవారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.