ఐదుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్

ADB: భైంసా మండలంలోని హస్గుల్ గ్రామ శివారులో పేకాట అడుతున్న ఐదుగురిని ఆదివారం గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు భైంసా రూరల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేశామన్నారు. ఐదుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద రూ.15,390 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.