VIDEO: కేతేపల్లిలో గుడిసె దగ్ధం

VIDEO: కేతేపల్లిలో గుడిసె దగ్ధం

WNP: పానగల్ మండలం కేతేపల్లిలో గడమాల కురుమయ్యకు చెందిన గుడిసె షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. గుడిసెలో గ్యాస్ సిలిండర్ ఉందని యజమాని చెప్పడంతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారికి ధైర్యం చెప్పారు. వెంటనే ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను అదుపు చేయడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.