'నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి'

'నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి'

ADB: గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని రూరల్ సీఐ ఫనిధర్ అన్నారు. మంగళవారం తాంసి మండల కేంద్రంలో గణేష్ మండపాల నిర్వహకులతో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. నిమజ్జనంలో అధిక శబ్దంతో కూడిన డీజెలకు అనుమతి లేదని సూచించారు. బలవంతపు చందాలు వసూలు చేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణ, ఎస్సై జీవన్ రెడ్డి తదితరులున్నారు.