అవనిగడ్డ నుంచి అరుణాచలానికి బస్సు

అవనిగడ్డ నుంచి అరుణాచలానికి బస్సు

కృష్ణా: అవనిగడ్డ డిపో నుంచి అరుణాచలానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ కె.హనుమంతరావు తెలిపారు. మే 10న సాయంత్రం 5 గంటలకు బయలుదేరే ఈ బస్సు నాలుగు రోజుల యాత్రలో కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, విష్ణు కంచి, శివ కంచి, కామాక్షమ్మ గుడి, తిరుత్తణి, శ్రీకాళహస్తి వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించనుంది.