తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా సరిత

BHNG: రాష్ట్రంలోని టీజీఎస్ ఆర్టీసీలో తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యతండాకు చెందిన సరిత శనివారం విధుల్లోకి చేరారు. తొలి రోజు హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్సు నడిపారు. ఇన్నిరోజులు ఢిల్లీలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సాయంతో రాష్ట్రంలో డ్రైవర్‌గా అవకాశం దక్కించుకున్నారు.