VIDEO: 'నష్టపోయిన రైతాంగానికి నష్ట పరిహారం చెల్లించాలి'
NZB: కోటగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి విఠల్ గౌడ్ మాట్లాడుతూ.. అకాల వడగండ్ల వర్షాలకు కోటగిరి, పోతంగల్ మండలాల్లో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకుని, పంట నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.