'సీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి'
ప్రకాశం: 13వ సీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బడుగు వెంకటేశ్వర్లు కోరారు. మంగళవారం హనుమంతునిపాడు మండల కేంద్రంలో ఈనెల 8, 9 తేదీలలో దర్శిలో జరగనున్న సీఐటీయూ మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. కార్మిక సంఘాల ఐక్యత హక్కుల సాధనకు దోహదపడుతుందన్నారు.