పేకాట శిబిరంపై దాడి.. 10 మంది అరెస్ట్
ELR: నూజివీడు శివారులో పేకాట ఆడుతున 10 మంది వ్యక్తులని మంగళవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 15,080ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు, జూదానికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నూజివీడు టౌన్ సీఐ సత్య శ్రీనివాస్ హెచ్చరించారు.