అమ్మవారి మూలవిరాట్‌ను తాకిన సూర్యకిరణాలు
NTR: పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం అరుదైన దృశ్యం దర్శనమిచ్చింది. చైత్రమాస పాడ్యమి సందర్భంగా ఉదయం 6:30 నుంచి 6:45 వరకు సూర్యకిరణాలు గర్భగుడిలోని అమ్మవారి మూలవిరాట్‌ను తాకాయి. ఈ దివ్య కాంతి భక్తులను ఆకట్టుకుంది. ఇది శుభసూచకమని పూజారులు తెలిపారు. శుక్రవారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు.