పల్లి గింజ మీద శ్రీరాముని ప్రతిమ

WGL: కాశీబుగ్గకి చెందిన మైక్రో ఆర్టిస్ట్ కుసుమ లింగమూర్తి ఆదివారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాముని మీద భక్తితో పల్లి గింజ మీద శ్రీరాముని ప్రతిమను గీసి ఔరా అనిపించాడు. ఈయన గతంలో తెలంగాణ ఏర్పాటైన సమయంలో బియ్యపు గింజలతో తెలంగాణ ఆకారాన్ని, పల్లి, బియ్యపు గింజల మీద వినాయకుని బొమ్మను, శనగ పప్పు మీద వివేకానందుని బొమ్మను గీసి అందరినీ ఆకట్టుకున్నాడు.